Friday, 4 May 2012

~~~~~కల్లోల పవనాలు~~~~~

నా భవిష్యత్తు ఉహలలో విహరిస్తోంది …గతమంతా అనుభవాలతో నిండిపోయింది.
మనసు కలల కోసం ఆరాటపడుతోంది …మెదడు కాస్త ఆగి అల్లోచించమంటోంది.
చుట్టూ ఇందరు ఉన్నా, ఒంటరి నన్న భావన వెంటాడుతోంది …
మనసు  కోరే  తోడు  కోసం అన్వేషిస్తోంది …
ఆశలకు  అంతం  లేదు, ఉహలకు  తీరం  లేదు...
మనసు  మాట  వింటే,  భవిష్యత్తు ఏమిటన్న ఆలోచన ….??
మెదడు  మాట  విని, మనసుతో  ఏగడం చేతగునా …!!
వాస్తవానికి  విరుద్దంగా, కలలతో భవిష్య నిర్మాణం వ్యర్థం.
ఉహాలను వాస్తవానికి దగ్గరగా తేవడం కష్టం...
మంచి మంచతూనే చెడు వైపు మొగ్గుతోంది మనసు, దానిని దారి మళ్ళించడం ఎవరికీ తెలుసు...??

మనసు మాట వినదు …. మెదడు ఆలోచన మానదు …
మనసు మెదడుల అంతఃసంఘర్షణ...!!! ఎటు వైపు మొగ్గాలో తెలియకనే ఈ  వేదనా...??
మనసుతో పరుగులు తీయలేక, మస్తిష్కం మొద్దుబారుతోంది....


     
ఆశ, అత్యాశలకు బేధం తెలియక...
కలలకు, వాస్తవానికి సమన్వయము కుదర్చలేక...
బ్రతకడానికి, జీవితానికి మద్య బేరం చేయలేక...
ఆశల తెరచాపతో , ఉహల  పడవపై , భవిష్యత్ సంద్రం  లోనికి సాగిపోతున్న  నాకు, తీరం అగమ్యగోచరం...  అందకారమయం….

అందుకే,

 దూర తీరాన్నితెలిపే దిక్సూచి కోసం వేచి  చుడాడం. తుఫాను తాకిడులకి  అట్టుడికి  పోవడం. నడి సంద్రంలో సుడిగుండాలతో కల్లోల పడాడం...

2 comments:

  1. Basic ga neeku boy frnd kavalani artham ayyindi.. daniki nee lipi add chesi kummesav.. nice one btw..

    ReplyDelete
  2. Abbaa... sai Nuv chala talented... But i have written keeping every teeneagers confusion in mind... :)

    ReplyDelete